ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

by Vemula.Srinu Prasad |

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు..

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబుకు శనివారం ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సీఎంగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని మోడీ కొనియాడారు. ఇరువురు సీఎంలుగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కలిసి పని చేశామని నాటి సంగతులను మోడీ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని... ప్రజా సంక్షేమ బాటలో చంద్రబాబు అంకితభావంతో చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.

అయితే స్పందించిన సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత ప్రధానిగా 25 ఏళ్లుగా మోడీ దేశానికి సేవలందిస్తున్నారని చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు సైతం ట్వీట్ చేశారు

Next Story