మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. అదే పవనిజం : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-02 04:10:02  IST  )

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. అదే పవనిజం : సీఎం చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. పవనిజం అంటే ఏంటో వివరిస్తూ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

"మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు." అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్

Next Story