- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: యూత్‌కు కీలక పిలుపు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు చంద్రబాబు కీలక పిలుపు

దిశ, వెబ్ డెస్క్: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది" అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న యువతీ యువకులందరికీ సీఎం చంద్రబాబు నాయడు (Cm Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళుర్పించారు. వివేకానంద స్వామి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యువతకు సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు..‘‘శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.






