29, 30న కుప్పంకు చంద్రబాబు.. కారణం ఇదే..?

by Vemula.Srinu Prasad |

కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు...

29, 30న కుప్పంకు చంద్రబాబు.. కారణం ఇదే..?
X

దిశ, చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 29న కుప్పంకు రానున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. కుప్పంకు హంద్రీ-నీవా జలాలు చేరుకోవడంతో ఇదే మండలంలోని పరమసముద్రం చెరువులో ఈ జలాలకు 30న ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వనున్నారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత నెల 17న చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీ-నీవా కాలువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవి అన్నమయ్య జిల్లా మదనపల్లె దాటుకుని ఈ నెల 22వ తేదీ పుంగనూరుకు చేరుకున్నాయి. 23న పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల పరిధిలోకి చేరాయి. ప్రస్తుతం హంద్రీ-నీవా కాలువలో 80క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రికి ఈ జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశిస్తాయి. కుప్పం ప్రజల కల సాకారం అవుతుండటంతో పరమసముద్రం చెరువులో హంద్రీ-నీవా జలాలకు జలహారతి ఇచ్చి... సమీపంలో బహిరంగ సభలో పాల్గొని కుప్పం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పరమసముద్రం చెరువు వద్ద అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు

Next Story