స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

స్వగ్రామంలో నిర్వహించనున్న సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు..

స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు.. పాల్గొననున్న  సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: తన స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు నాయుడుకు చేరుకున్నారు. సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుంటారాయన. ఈ ఏడాది కూడా స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి మంగళవారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు.

Next Story