మరో పర్యటనకు సీఎం చంద్రబాబు.. తేదీలివే..?

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు...

మరో పర్యటనకు సీఎం చంద్రబాబు.. తేదీలివే..?
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) మరో పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన లండన్(London) వెళ్లనున్నారు. వచ్చే నెలలో విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహించ నేపథ్యంలో ఆయన లండన్ పర్యటన ఆసక్తిగా మారింది. నవంబర్ 2న ఆయన లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడి పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు. విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబుడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే లండన్ వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు లండన్ పర్యటనను అధికారులు ధృవీకరించారు. ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రకటన విడుదల చేశారు.

కాగా ప్రధాని మోడీ ప్రస్తుతం శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం చంబ్రాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. చత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న అద్భుతమైన శిల్పాలను తిలకలించారు. ఇక ప్రధాని మోడీ రాష్ట్రంలో ఉండగానే సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ఖరారు కావడం ఆసక్తిగా మారింది.

Next Story