పెద్దన్నగారిపల్లికి సీఎం చంద్రబాబు.. పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-31 15:01:51  IST  )

శ్రీసత్యసాయి జిల్లా పెద్దన్నగారిపల్లిలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లను పంపిణీ చేయనున్నారు....

పెద్దన్నగారిపల్లికి సీఎం చంద్రబాబు.. పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం
X

దిశ ప్రతినిధి పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలోని తలపుల మండలం పెద్దన్నగారిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దన్నగారిపల్లిలో కట్టుదిట్టమైన భద్రత ముందస్తు ఏర్పాట్లు చేశారు. సమన్వయంగా ప్రణాళికాబద్దంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జేసి మౌర్య భరద్వాజ్‌లతో కలిసి పెద్దన్నగారిపల్లిలో సీఎం హెలిపాడ్, ప్రజా వేదిక సభాస్థలం, బందోబస్తు ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి మ్యాపులను పరిశీలించి, ప్రజా వేదిక, విఐపి, గ్రామస్తులు మరియు మీడియా గ్యాలరీ సీటింగ్, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, అలాగే అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అధికారులందరూ సమన్వయంతో ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లను ముందస్తుగా పూర్తిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉమ్మడి జిల్లా నుండి ప్రజా ప్రతినిధులు ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనకు విచ్చేయనున్న సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కొరకు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో అధికారులతో సమీక్షించి తగు సూచనలు సలహాలు జారీ చేశారు.

Next Story