పరామర్శ పేరుతో రౌడీయిజం: జగన్‌కు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 16:53:02  IST  )

పరామర్శ పేరుతో రౌడీయిజం చేస్తామంటూ చూస్తూ ఊరుకోమని జగన్ మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు

పరామర్శ పేరుతో రౌడీయిజం:  జగన్‌కు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పరామర్శ పేరుతో రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)కి సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం కార్యకర్తలతో సమావేశమైన ఆయన పొదిలి జగన్ పర్యటనను గుర్తు చేస్తూ మండిపడ్డారు. అడ్డొస్తే తొక్కేస్తామని పొదిలిలో వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించడంపై చంద్రబాబు మండిపడ్డారు. తమరు ఎవరిని తొక్కేస్తారని, ఇక్కడుంది చంద్రబాబు నాయుడు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story