అప్పుడు ఆంక్షలు.. ఇప్పుడు వారి ముఖాల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు...

అప్పుడు ఆంక్షలు.. ఇప్పుడు వారి ముఖాల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని సీఎం చంద్రబాబు(Chandrababu) కోరుకున్నారు. విజయవాడ సీతార సెంటర్‍(Vijayawada Sithara Central)‌లో డూండీ గణేష్ సేవాసమితి(Dundee Ganesh Seva Samiti) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి(Mahashakti Ganapati)ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలంటే చాలా ఆంక్షలు ఉండేవని గుర్తు చేశారు. కరెంట్ కోసం అనుమతులు తీసుకోవాల్సి ఉండేదని, ఈసారి వినాయక భక్తుల ముఖాల్లో చిరునవ్వు కోసం ఉచిత కరెంట్ ఇచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని కోరుకున్నట్లు తెలిపారు. మరోసారి బుడమేరు వరద రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు వరద నీటితో ఫుల్ అయ్యాయన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసిపోయిందని చంద్రబాబు తెలిపారు.

Next Story