ఒక కప్పు కాఫీని మించినది ఏదీ లేదు: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 11:17:33  IST  )

ఒక కప్పు కాఫీని మించినది ఏదీ లేదని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు..

ఒక కప్పు కాఫీని మించినది ఏదీ లేదు: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్
X

దిశ. వెబ్ డెస్క్: అరకు కాఫీ(Araku coffee)కి దేశ, విదేశాల్లో గుర్తింపు ఉంది. ఎన్నో కాఫీలు ఉన్నా ఖాతి మాత్రం అరకు కాఫీకి ఉంది. అయితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పార్లమెంట్‌(Delhi Parliament)లోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ఎరువులు వాడకుండా కాఫీని సాగు చేసేందుకు అరకు రైతులకు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నారు.


ఈ మేరకు తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District) పాడేరు మండలం వంజంగిలో కాఫీ ప్లాంటేషన్‌(Coffee Plantation)ను సందర్శించారు. కాఫీ తోటలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులతో కలిసి అరకు కాఫీని టెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఒక కప్పు తాజా అరకు కాఫీని మించినది ఏదీ లేదు, అది పండిన చోట, ప్రకృతి హృదయంలో ఆనందించండి. ఇక్కడ గిరిజనులు చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రత్యేకమైన కాఫీకి ప్రాణం పోస్తాయి.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ట్వీట్.

Next Story