- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మేంద్ర మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఎక్స్‌లో ఎమోషనల్ ట్వీట్
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ దిగ్గజ నటుడు, తొలితరం హీరో ధర్మేంద్ర(Hero Dharmendra) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో 300కు పైగానే సినిమాల్లో నటించారు. షోలే సినిమాతో భారత సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సైతం ట్వీట్ చేశారు. ‘‘ధర్మేంద్ర మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దిగ్గజ నటుడు, మరపురాని నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ధర్మేంద్ర చేసిన కృషి తరతరాలుగా గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read More... భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం






