- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనవడు దేవాన్ష్ పుట్టినరోజు: శ్రీవారి చెంతకు సీఎం చంద్రబాబు
రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనవడు నారా దేవాన్ష్(Nara Devansh) పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తిరుమలకు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌కు సైతం శ్రీవారి కొండకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. అయితే మంత్రి నారా లోకేశ్ కూడా రాత్రికి కొండపైకి చేరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబం
శనివారం దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకోనుంది. అనంతరం మొక్కులు తీర్చుకోనుంది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా వారి కుటుంబం ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకుంటుంది. ఇందులో భాగంగా ఈసారి సైతం స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
మరోవైపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. ఒక రోజు అన్నవితరణ ఖర్చు నిమిత్తం రూ.44 లక్షలను ట్రస్టుకు విరాళంగా అందజేయనుంది. ఇక దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనున్నారు.






