- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్హా శాంతివనాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నేడు శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని (Kanha Shanti Vanam) సందర్శించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నేడు శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని (Kanha Shanti Vanam) సందర్శించనున్నారు. ఉదయం శాంతివనానికి చేరుకోనున్న సీఎం.. అక్కడ వివిధ కీలక కేంద్రాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను తిలకించనున్నారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, స్థిరమైన వాతావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బయోచార్ కేంద్రాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. అంతేకాకుండా కన్హా శాంతివనంలో ఉన్న గోపిచంద్ స్టేడియం, హార్టిఫుల్ నెస్ స్కూల్ సందర్శన సైతం ముఖ్యమంత్రి దినచర్యలో భాగంగా ఉంది. పర్యటన ముగింపులో శాంతివనం వ్యవస్థాపకులు, దాజీ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆధ్యాత్మిక, ఆరోగ్యకర జీవనశైలితో పాటు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సీఎం మరింత దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మధ్యాహ్నం సమాయానికి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోనున్నారు. రాజధానిలో పనుల పురోగతిని, ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించేందుకు వీలుగా సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పాలన, అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. పాలనాపరమైన సమావేశాల అనంతరం సాయంత్రం సమయానికి సీఎం విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. అక్కడ దివంగత నాయకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవాడలోని చారిత్రక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనుంది. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు నేడు కన్హా శాంతివనం సందర్శన, అమరావతిలో పాలనా సమీక్షలు, విజయవాడలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బిజీబిజీగా గడపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.






