నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

by Naga Rani Yarlagadda |

తూర్పు గోదావరిజిల్లా నల్లజర్లలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరిజిల్లా నల్లజర్లలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఇందులో పాల్గొనే రైతులకు.. రైతులకోసం రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న పనుల గురించి వివరించనున్నారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు.

అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. అలాగే ఎప్పుడూ ఒకేరకమైన పంటలు కాకుండా.. నూతన, లాభదాయకమైన పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Next Story