- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్రమంత్రులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్రమంత్రులతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. 24న నీతి ఆయోగ్ (Niti Aayog) పాలకమండలి సమావేశానికి హాజరవుతారు. 24వ తేదీ రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతి (Amaravati)కి బయల్దేరుతారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం (CM Delhi Visit) పలువురు వ్యాపారవేత్తలను కలిసి.. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు సమాచారం.
కాగా.. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెరిగిన పంటల దిగుబడులు, పంటల ధరలపై ప్రభావానికి కారణాలను అధికారులు వివరించారు. మిర్చి, పొగాకు, ఆక్వా, చెరకు, కోకో, మామిడి వంటి పంటల ఉత్పత్తులు తగ్గడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు.






