- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu : ఈ నెల 28న అయోధ్యకు సీఎం చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 28న అయోధ్యకు వెళ్లనున్నట్లు అధికారుల సమాచారం. అక్కడ రామజన్మభూమిని చంద్రబాబు సందర్శించనున్నారు. పర్యటనకు సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అలాగే మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ‘భారతీయ విజ్ఞాన సమ్మేళనం' కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి 29 వరకు జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీస్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారమే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.






