ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు మంత్రులతో చర్చలు

by Naga Rani Yarlagadda |

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెండ్రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఆయన ఏడుగురు కేంద్రమంత్రులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాల గురించి చర్చించి.. తగిన సహకారం కోసం విజ్ఞప్తి చేయనున్నారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు మంత్రులతో చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెండ్రోజులపాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఆయన ఏడుగురు కేంద్రమంత్రులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాల గురించి చర్చించి.. తగిన సహకారం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. డిఫెన్స్, స్పేస్ మానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్రం అందించే సహాయం, ఇంటింటికీ త్రాగునీరు, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నిర్వహించే సమీక్షకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.

ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయి రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు (Green Energy Project)ల సహకారంపై చర్చిస్తారు. 11 గంటలకు రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)తో సమావేశమై BEL డిఫెన్స్ కాంప్లెక్స్ HAL - AMCA ప్రోగ్రాంతో సహా ఏపీ వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకూ శ్రమ్ శక్తిభవన్లో జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil)తో భేటీ అయి నీటి మౌలిక సదుపాయాలు, పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రతిపాదనలపై మాట్లాడనున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తో సమావేశమై నూతన పరిశోధనలు, ఆవిష్కరణ పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. సాయంత్రం 3 గంటలకు నిర్మలా సీతారామన్ తో భేటీ అయి.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించి మెరుగైన ఆర్థిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి.. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఏపీ పాత్రపై చర్చించనున్నారు.

Next Story