దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు

by Muthe.Rajitha |

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. 2026 జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం సెక్రటరీ కార్తీకేయ మిశ్ర, పరిశ్రమల సెక్రటరీ ఎన్. యువరాజ్ మొదలైన మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. 'బ్రాండ్ ఏపీ'ని ప్రమోట్ చేయడంతోపాటు, గ్రీన్ హైడ్రోజన్, హై-వాల్యూ మాన్యుఫాక్చరింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా, స్కిల్ డెవలప్‌మెంట్, గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లపై దృష్టి పెట్టి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

Next Story