వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ.. వైసీపీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ పదే పదే చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ.. వైసీపీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ పదే పదే చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ వేదికపైనే వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేయడం లేదు అని మీ ఇంటికి వచ్చి చెప్పాలా? కేంద్రం రూ.12 వేల కోట్లు ఇచ్చింది సంస్థను కాపాడేందుకు కాదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావాలన్నదే తమ ప్రయత్నమని సీఎం స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారని చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని సూచించారు.

Next Story