ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. అన్నదాత సుఖీభవ ప్రారంభం

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. అన్నదాత సుఖీభవ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava) దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేలను జమ చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం (PM Kisan Scheme) కింద ప్రతి ఏటా ఇచ్చే రూ.6 వేలకు రాష్ర్ట ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి.. ఒక్కోరైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Next Story