- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఉద్దేశంతోనే సింగపూర్ పర్యటనకు వచ్చా : సీఎం చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహం లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సౌత్‌ఈస్ట్ ఆసియా నుంచి వచ్చిన తెలుగు ప్రజల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు స్థాపించామని గుర్తుచేశారు. అప్పట్లో ఈ చర్యపై విమర్శలు వచ్చినప్పటికీ, భవిష్యత్తు అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీదేనన్న దృష్టితో ముందడుగు వేశానన్నారు.
తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలంటే ఐటీ రంగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దృష్టికోణంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు స్థిరపడే అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రస్తుతం సింగపూర్‌లో 40 వేల మంది తెలుగు ప్రజలు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందించి అందించిందని గుర్తు చేశారు. 2019 తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల సింగపూర్ (Singapore) ప్రభుత్వానికి రాష్ట్రంపై నమ్మకం తగ్గిందని, రాష్ట్ర బ్రాండ్ ప్రతిష్ఠ క్షీణించడం వల్ల నష్టాలు జరిగాయని తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిచేసే ఉద్దేశంతోనే తన ఈ పర్యటన చేపట్టినట్లు వెల్లడించారు.






