- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"ఆటోడ్రైవర్ సేవలో" పథకం ప్రారంభ తేదీని ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఎన్డీఏ ప్రభుత్వం అందరిదీ.. అందరి బాగోగులు చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

- ఎన్డీఏ ప్రభుత్వం అందరిదీ.. అందరి బాగోగులు చూస్తాం
- సూపర్ సిక్స్.. సూపర్ హిట్
- అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో, వెబ్‌డెస్క్: ఎన్డీఏ ప్రభుత్వం అందరిదీ.. అందరి బాగోగులు చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో సూపర్ సిక్స్ పథకాలు, మేనిఫెస్టో హామీలపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. అర్హుడైన ప్రతి డ్రైవర్ను మేము ఆదుకుంటామని తెలిపారు. పెండింగ్ చలాన్లు, ఫిట్నెస్ ధ్రువపత్రాలు క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వచ్చేనెల 4న సాయంత్రం నాలుగు గంటలకు ఆటోడ్రైవర్లకు సాయం అందిస్తాము అని తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా పింఛన్లు అందిస్తున్నాను అని, ప్రస్తుతం రాష్ట్రంలో 63.5 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పింఛన్ లబ్ధిదారుల్లో 59 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నాం అన్నారు. వివిధ వర్గాలకు పింఛన్లు ఎక్కువ ఇచ్చే రాష్ట్రాల్లో మనమే నెంబర్ వన్ తెలిపారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అండగా నిలిచాము అన్నారు. 74% ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. స్త్రీ శక్తి వచ్చాక ఆక్యుఫెన్సీ రేషియో 69 నుంచి 90 శాతానికి పెరిగింది అన్నారు.






