- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొందరు అంతే.. ఎప్పుడూ బూతులే: సీఎం చంద్రబాబు ఫైర్
కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. తన భార్యను అసెంబ్లీలో అవమానించారని గుర్తుచేశారు. 23 క్లేమోర్ మైన్స్ ప్రయోగించినా తాను భయపడలేదన్నారు. వెంకటేశ్వరస్వామి తమ ఇంటి దైవం అని చెప్పారు. వెంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారన్నారు. అలాంటి శ్రీవారిని అపవిత్రం చేస్తే సహిస్తామని అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో లడ్డూ నెయ్యిని కల్తీ చేసి ఇప్పుడు హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారన్నారు. ప్రాణం పోయినా తాను తప్పు చేయనన్నారు. లడ్డూలో వినియోగించింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని, తప్పు చేసి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
చెత్త ఇవ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
Next Story






