చెత్త ఇవ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-21 10:50:47  IST  )

చెత్త ఇవ్వండని, నిత్యావసరాలు తీసుకోండని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు...

చెత్త ఇవ్వండి.. నిత్యావసరాలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: చెత్త ఇవ్వండని, నిత్యావసరాలు తీసుకోండని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ(Vinukonda)లో స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం(Chariot) ఉంటుందని తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛ రథాలు ప్రతి ఇంటి వద్దకు వచ్చి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనంతా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనే దానిపైనే ఉంటుందన్నారు. పౌరుషాల గడ్డ పల్నాడు అని, ఈ ప్రాంతానికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

కొందరు అంతే.. ఎప్పుడూ బూతులే: సీఎం చంద్రబాబు ఫైర్

Next Story