YS Sharmila : తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి : వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |

తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)కు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)నే బాధ్యత(Responsibility) వహించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila : తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)కు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)నే బాధ్యత(Responsibility) వహించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు.

లడ్డూ కల్తీపై ఎలాగైతే స్పందించారో..వైసీపీపై ఆరోపణలు చేశారో..తొక్కిసలాట ఘటనలో కూడా అదే విధంగా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నిరు. వైకుంఠ ఏకాదశికి అంత మంది జనం వస్తారని తెలిసి కూడా సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలకపోయారన్నారు.

ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, ఇకమీదట ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story