త్వరలో ఆ పార్టీకి అడ్రస్ ఉండదు: స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు..

త్వరలో ఆ పార్టీకి అడ్రస్ ఉండదు: స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి అడ్రస్ ఉండదని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఎద్దేవా చేశారు. కడప టీడీపీ మహానాడు(Kadapa Tdp Mahanadu) బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన గత పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. గత ఐదేళ్లలో భూమాఫియాలు చెలరేగిపోయాయి. నమ్మి ఓట్లేస్తే ప్రజలను మోసం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల్యాండ్, ఇసుక, మైన్‌ను దోచుకున్నారు. జే బ్రాండ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. యువతను డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడేలా చేశారు. ఆర్థిక ఉగ్రవాదులతో రాష్ట్రానికి చాలా నష్టం. వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చేస్తాం. ఎన్ని సమస్యలు అడ్డు వస్తున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. ఒక్క పెన్షన్లకే రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైనాట్లు, గొడ్డలిపోట్లు మా హయాంలో ఉండవు. అలాంటి రాజకీయం చేయం. సంవత్సరం క్రితం రాష్ట్రంలో చిమ్మచీకట్లు, అస్తవ్యస్తమే ఉంది. బాంబులకే భయపలేదు.. సమస్యలకు భయపడతామా..?. నాకున్న అనుభవంతో సవాళ్లను అధిగమిస్తు్న్నా.’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Next Story