- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా అమరావతి : సీఎం చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రెండోరోజు ఆయన అబుదాబీలో ఛాంబర్ ఛైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ 42 సీఈఓ మాన్సూరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఆయనతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పయనిస్తోందని తెలిపారు. రాజధాని నగరమైన అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని, రాజధాని నగరం కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్ కు కేంద్రంగా ఉంటుందని వివరించారు.
నవంబర్ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పార్ట్నర్ షిప్ కాన్ఫరెన్స్ కు రావాలని అహ్మద్ జాసిమ్ అల్ జాబీ, జీ 42 సీఈఓ మాన్సూరీని ఆహ్వానించారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి, పెట్టుబడులపై ఆలోచిస్తామని వారు తెలిపారు. అనంతరం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయి.. ఏపీలో ఇంధనరంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను గురించి వివరించారు. పెట్రో కెమికల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు.






