- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో ప్రపంచానికే దిక్సూచిగా ఉంటా: సీఎం చంద్రబాబు
మానవ వనరుల విషయంలో ప్రపంచానికే దిక్సూచిగా ఉంటామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటరీకి కేరాఫ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, భారతదేశంలో అమరావతి అని చంద్రబాబు కొనియాడారు....

దిశ, వెబ్ డెస్క్: మానవ వనరుల విషయంలో ప్రపంచానికే దిక్సూచిగా ఉంటామని సీఎం చంద్రబాబునాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఏపీ అసెంబ్లీ(Ap Assembly)లో ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటరీ(Quantam Computary)కి కేరాఫ్ అమెరికా(America)లోని సిలికాన్ వ్యాలీ(Silicon Valley), భారతదేశంలో అమరావతి(Amaravati) అని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, కానీ పారిశ్రామిక వేత్తల విముఖత అని వైసీపీ దుష్ప్రచారం చేసిందన్నారు. ఎంతమంది విమర్శించినా సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బ్రాండ్ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి ఉన్నంత వరకూ రాష్ర్ట్రానికి పెట్టుబడులు క్యూ కడతాయని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నామని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని అంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






