దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ..

దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చంద్రబాబు మండిపడ్డారు. కత్తులు, కటారాలుతీసుకొచ్చనా పర్వాలేదు గాని, ఇక్కడ సీబీఎన్ ఉన్నారన్నారు. నంద్యాల వైఎస్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలేనని, ఆ నెపాన్ని టీటీడీపై నెట్టాలని చూశారని వ్యా్యానించారు. అయినా సరే రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని చంద్రబాబు గుర్తు చేశారు. నాటకాలతో వైసీపీ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు

గత ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ భయలేకపోయిదని ఎద్దేవా చేశారు. తాము డీఎస్సీ నిర్వహిస్తే 2 వేల కేసులు వేశారన్నారు. అయినా సరే చాలా పకడ్బందీగా డీఎస్సీ నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో మత విధ్వేషాలు సృష్టించాలకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల భక్తులకు సరైన సౌకర్యాలు కల్పిస్తు్న్నామన్నారు. తిరుమలకొండపై మద్యం విక్రయాలు వైసీపీ కుట్రలేనని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తనిఖీలు నిర్వహిస్తే వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని, అక్రమ సంపాదనలో డబ్బు ఇవ్వలేదని వైసీపీ నేతలే దస్తగిరిని అత్యంత దారుణంగా చంపేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Next Story