మాటిచ్చాం.. రుణం తీర్చుకున్నాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు..

మాటిచ్చాం.. రుణం తీర్చుకున్నాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాను, మిత్రుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan), ప్రధాని మోడీ(Pm Modi) ప్రజలకు మాటిచ్చామని, సూపర్ 6 అమలు చేసి ప్రజల రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’(Clean Andhra-Golden Andhra) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై చంద్రబాబు మాట్లాడారు. పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చాలా వేగంగా అందిస్తున్నామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్ లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారంచుడుతున్నామని చెప్పారు. గతంలో తాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై మాట్లాడానని, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై మాట్లాడుతున్నానని తెలిపారు. మార్చి 26 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోందని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చి చెత్తను రీ సైక్లింగ్ చేపట్టామని చెప్పారు. వేస్ట్ నుంచి సంపద కలుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘‘చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నాం. గతంలో ఎక్కువ రసాయనాలు వాడే రైతులు... ఇప్పుడు కంపోస్ట్ ఎరువులు వాడుతున్నామని రైతులు చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. జనవరి 26కు రోడ్డుపై వేస్ట్ అనేది కనబడకుండా టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా పొడిచెత్తను సేకరిస్తున్నాం. వీటి సంఖ్య 100కు త్వరలోనే పెంచి మరిన్ని అందుబాటులోకి తెస్తాం. పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్టుగా పెట్టుకున్నాం. ఇది 3.91 లక్షల ఇళ్లలో ఇది జరుగుతోంది. అలాగే రూరల్ ప్రాంతంలో 10 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే... 3.30 లక్షల ఇళ్లల్లో చేస్తున్నాం.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story