రెండు త్రైమాసికాల్లో ఏపీకి మెరుగైన ఫలితాలు.. సీఎం చంద్రబాబు హర్షం

by Vemula.Srinu Prasad |

గత 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు

రెండు త్రైమాసికాల్లో ఏపీకి మెరుగైన ఫలితాలు.. సీఎం చంద్రబాబు హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: గత 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలిపారు. వివిధ శాఖల పని తీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 17.11 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. GSDP సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. గతంలో తెలంగాణతో సమానంగా ఉండేవాళ్లమని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాలతో దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రం చివరి స్థానానికి చేరిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఇక నుంచి ఏ పని చేసినా సమగ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిత్యం నేర్చుకునే పనిలో ఉండాలని సూచించారు. మంచి ఆలోచన ఎవరు చేసినా ప్రోత్సహిస్తామని తెలిపారు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్నారు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం బాధ్యతతో పని చేయాలని, అధికార దుర్వియోగం చేయొద్దని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Next Story