మేమేంటో ఏడాదిలోనే చూపించాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-23 13:36:12  IST  )

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

మేమేంటో ఏడాదిలోనే చూపించాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు-ఏడాది పాలనపై అమరావతి సెక్రటేరియట్ వెనుక భాగంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కూటమిపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, పోటీ చేసిన 94 శాతం మంది అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కలిసి పని చేస్తున్నామని, అభివృద్ధి కూడా వేగంగా పరుగులు తీస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర విజన్ 2047 ను రూపొందించామని తెలిపారు. అన్ని చేసేశామని తాము చెప్పడం లేదని, కానీ ఊహించినదాని కంటే ఎక్కువ చేశామని చెప్పారు. తనకు సీఎం పదవి కొత్తేమీ కాదని, కానీ ప్రతీసారి సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలించానని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అధికారంలో వచ్చామని, ఇప్పటి వరకు తమ మధ్య ఎలాంటి సమస్య రాలేదన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్నామని, ప్రతి హామీ నెరవేర్చుతున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు అధికారులు సైతం కూటమితో కలిసి అడుగులు వేయాలని కోరారు. గత ప్రభుత్వం సృష్టించిన అరాచకాలతో పెట్టుబుడిదారులు భయపడిపోయారని చంద్రబాబు తెలిపారు.

Next Story