మీడియాతో ఇష్టాగోష్టి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రఅభివృద్ధే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు..

మీడియాతో ఇష్టాగోష్టి.. సీఎం చంద్రబాబు  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కోస్తా(Kosta), రాయలసీమ(Rayalaseema), ఉత్తరాంధ్ర(Uttarandra) అభివృద్ధే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అటు రాజధాని విస్తరణ కోసం రైతులంతా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రైతులందరూ ఒకే అసోసియేషన్ కిందకు రావాలని, జేఏసీగా ఏర్పడితే సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు.

కేపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నామని, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Minister Nirmla Sitharaman)కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయితే కేంద్ర పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పారని చంద్రబాబు వివరించారు. దశలవారీగా రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. అమరావతి రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేసేందుకు త్వరలో ఓ కార్యచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story