- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ బడ్జెట్‌పై చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్ర వార్షిక బడ్జెట్ మెరుగానే ఉందని, వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే మరింత సమయం పడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వార్షిక బడ్జెట్(Annual Budget)ను ఏపీ అసెంబ్లీ(Ap Assembly)లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీ(Assembly) లాబీలో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ ఆర్థిక శాఖ(Finance Department) ప్రవేశపెట్టిన బడ్జెట్ మెరుగానే ఉందన్నారు. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే మరింత సమయం పడుతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే కొన్ని పనులు పుంజుకున్నాయని చంద్రబాబు తెలిపారు.
చాలా తక్కువగా ఆదాయం
రాష్ట్రంలో ఆదాయం చాలా తక్కువగా ఉందని, ఖర్చులు భారీగా ఉన్నాయని, ఇది వారసత్వంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తుండటంతోనే ఎలాగోకలాగా నెట్టుకొస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఇన్ కమ్ రావాలని, సేవారంగంలో ఆదాయం పెరగాలని సూచించారు. అమరావతికి ఓ రూపు వచ్చేటప్పటికి ఇంకా రెండు, మూడు ఏళ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం అమరావతి(Amaravati)కి రాకపోకలు పెరిగాయని, దాని వల్ల కొంత ఆదాయం వస్తోందని తెలిపారు. ఇన్నర్, ఓటర్ రింగు రోడ్డులతో ఇంకా యాక్సెస్ పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.






