బాండ్స్ ద్వారా రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లు : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-24 17:16:41  IST  )

బాండ్స్ ద్వారా రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు..

బాండ్స్ ద్వారా రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లు : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) ఎన్ని తప్పుడు మెయిల్స్ పెట్టినా రాష్ట్రానికి బాండ్స్ ద్వారా రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మరోసారి కూడా సింగపూర్ ప్రభుత్వం(Singapore Govt)తో మైత్రి కొనసాగించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మళ్లీ తిరిగి తెచ్చుకోవాలన్నారు. సింగపూర్ తో రాష్ట్రానికి ఉన్న మంచి సంబంధాన్ని జగన్ చెడగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. సింగపూర్ కన్సార్టియం వారిపైనా జగన్ సర్కార్ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం పోయిన తర్వాత సింగపూర్ కన్సార్టియం వాళ్లను తరిమేశారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Next Story