ఈ ఒక్కటే చాలు .... గంజాయి నేరాలపై సీఎం చంద్రబాబు సీరియస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-01 10:33:03  IST  )

గంజాయిపై గత పాలకులు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, కఠినంగా వ్యవహరించలేదని సీఎం చంద్రబాబు అన్నారు...

ఈ ఒక్కటే చాలు .... గంజాయి నేరాలపై సీఎం చంద్రబాబు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: గంజాయి(Ganjai)పై గత పాలకులు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, కఠినంగా వ్యవహరించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా (Eluru Distritct)పేదల సేవలో- ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గంజాయి డాన్‌గా మారిన ఓ మహిళ కూడా ఇప్పుడు బయటకు వచ్చారని నెల్లూరు కామాక్షిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ఒక్కటే చాలని చెప్పారు. ప్రస్తుతం బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపై నెపం నెట్టే నేరాలు ఉన్నాయన్నారు. మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తు్న్నామని తెలిపారు. తలసరి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.58 లక్షలకు పెంచటమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కూటమి కృషి చేస్తుందని తెలిపారు. కొందరు నటనతో కష్టపడుతున్నట్టు కనిపిస్తారని, వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story