వాళ్లు నన్ను చంపాలని చూశారు.. కానీ ఆయనే కాపాడారు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-19 11:12:32  IST  )

నక్సలైట్లు తనను చంపాలని చూశారని, కానీ ఆ వెంకటేశ్వరస్వామినే కాపాడారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

వాళ్లు నన్ను చంపాలని చూశారు.. కానీ ఆయనే కాపాడారు: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: నక్సలైట్లు తనను చంపాలని చూశారని, కానీ ఆ వెంకటేశ్వరస్వామినే కాపాడారని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. తిరుపతి(Tirupati)లో పర్యటించిన ఆయన పలు కీలక విషయాలు ప్రజలతో పంచుకున్నారు. తానెప్పుడూ హత్యా రాజకీయాలు చేయాలని అనుకోలేదని, అలా అనుకుని ఉంటే ఎవరినీ వదలిపెట్టేవాడిని కాదన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి(Ys Vivekananda Reddy)ని చంపి గుండె పోటు అంటూ వైసీపీ(Ycp) నేతలు డ్రామాలు అడారని గుర్తు చేశారు. నేరచరితులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంట్లో చెత్తను తీసినట్టే వాళ్లను కూడా తీయాలని చెప్పారు. తాను నక్సలిజం, ఫ్యాక్షన్ మతకలహాలపై పోరాటం చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలంటే ముందు స్వచ్ఛాంధ్రగా తయారు చేయాలని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి కేరాఫ్ అడ్రస్‌గా అమరావతిని మార్చుతామన్నారు. రాష్ట్ర రాజధానిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మించి ఏఐని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుపతిలో ప్రఖ్యాత విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. కాలుష్యం లేకుండా గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. వాతావరణాన్ని ముందుగా తెలుసుకునేందుకు త్వరలో ఓ యాప్‌ను తీసుకురాబోతున్నామన్నారు. 700 ప్రభుత్వ సేవలను ఆగస్టు 15 నాటికి వాట్సాప్ ద్వారా అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story