- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Secretariat: మరోసారి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్-2047 తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్-2047 తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి(Amaravati) సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో రాష్ట్ర రాజధానికి భ్రష్టు పట్టించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు పోలవరం ప్రాజెక్టు(Polavaram project) జీవనాడిలాంటిదని చెప్పారు. గత ప్రభుత్వంలో పోలవరాన్ని గోదావరి(Godavari)లో కలిపారన్నారు. 2014-19 సమయంలో విద్యుత్ రంగం(Electricity sector)లో సంస్కరణలు తీసుకొచి రాష్ట్రంలో వెలుగులు నింపినట్లు తెలిపారు. అయినా తాను ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఐటీపై తాను మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారని చెప్పారు. అలాంటి ఐటీ రంగం ప్రస్తుతం చాలా మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు.
విజన్-2047పై చంద్రబాబు ప్రజెంటేషన్
స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల జీఎస్డీపీ వివరాలను వెల్లడించారు. ఏపీ తలసరి ఆదాయం రూ.2,37, 951గా ఉందని తెలిపారు. రాష్ట్ర సంపదగా జీఎస్డీపీని గుర్తించాలని సూచించారు. విజన్ డాక్యుమెంట్ లో 16 లక్షల మంది భాగస్వాయులయ్యారని తెలిపారు. 2047నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ. 58,14,916 అవుతుందని పేర్కొన్నారు. జీఎస్డీపీ పెరిగితే వచ్చే సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎమ్ పెరుగుతుందని చెప్పారు. 15 శాతం వృద్ధి జరిగితే ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ ఏడాది వృద్ధి రేటు 12.94గా ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటికంటే ముఖ్యమైనది అభివృద్ధి అని, అదిగాని జరిగితే జీఎస్డీపీ, తలసరి ఆదాయం కచ్చితంగా పెరుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో దేశం కంటే రాష్ట్రమే ముందుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా.. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి 15.86 ఉందని చంద్రబాబు వెల్లడించారు. -






