అప్పుడు హామీ ఇచ్చా.. ఇప్పుడు పూర్తి చేస్తా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-25 11:19:45  IST  )

వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తయిందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దొంగ మాటలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

అప్పుడు హామీ ఇచ్చా.. ఇప్పుడు పూర్తి చేస్తా:  చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వెలిగొండ ప్రాజెక్టు(Veligonda Project) పనులు పూర్తయిందని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Pulivendula MLA YS Jagan Mohan Reddy) దొంగ మాటలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా గంటావానిపల్లె(Gantavanipalle)లోవెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెలిగొండ పనులు పూర్తి చేయకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారని విమర్శించారు. మార్కాపురం వెనుకబడిన ప్రాంతమని, మాటలతో తమ తగ్గరకు రాలేదన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తానని మాట ఇచ్చానని, ఇప్పుడు చేసి చూపించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

1996 మార్చి 5న..

మార్కాపురంతో పాటు మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశానని చంద్రబాబు తెలిపారు. 1996 మార్చి 5న మార్కాపురానికి వచ్చానని, ఎటు చూసిన ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయని, అప్పుడు తమకు శ్రీశైలం నీళ్లు కావాలని అడిగారని, కృష్ణా నీటిని తీసుకొస్తానని ఆ సమయంలో హామీ ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. వెలిగొండకు శంకుస్థాపన చేశానని, పూర్తి చేసే అవకాశం కూడా ఇప్పుడు తనకే వచ్చిందని చెప్పారు. 2014 వరకు వెలిగొండ పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. 2014-19 మధ్య పనులు పరుగులు పెట్టించాయని వ్యాఖ్యానించారు. వెలిగొండను పూర్తి చేయడం వల్ల 4 లక్షల ఎకరాలను రైతులు సాగు చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story