తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన తెలిపారు..

తిరుమలకు ఏ మతస్థులైనా రావొచ్చు: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)కు ఏ మతస్థులైనా రావొచ్చని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ నిబంధనను పూర్తిగా ఉల్లంఘించారని మండిపడ్డారు.2019-24 మధ్య రాష్ట్రంలో చాలా దేవాయాలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. దివంగత వైఎస్సార్ ఉన్నప్పుడే ఈ రకమైన చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తిరుమల(Tirumala) శ్రీవారిని ఏడుకొండలు కాదని, రెండు కొండలు మాత్రమే అని వైఎస్సార్ హయాంలో జీవో ఇచ్చారని, రెండేళ్ల పాటు ఆందోళనలు నిర్వహించడంతో వెనక్కి తగ్గారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. శ్రీవారిని అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష పడుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) హయాంలో పద్మావతి యూనివర్సిటీ(Padmavati University)కి క్రిస్టియన్‌ను వీసీగా నియమించారన్నారు. అప్పట్లో దీనిపై కూడా తాము పోరాటం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్ర స్పష్టంగా కనిపిస్తోందని, ఎవరూ మార్చలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉంటే ఆయన మాత్రం బైబిల్ పట్టుకుని తిరుగుతారని చెప్పారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూతురి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story