- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏదీ వృథా కాదు.. చెత్త ద్వారా సంపద సృష్టించొచ్చు: సీఎం చంద్రబాబు
ఏదీ వృథాకాదని, చెత్త ద్వారా సంపద సృష్టించొచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏదీ వృథాకాదని, చెత్త ద్వారా సంపద సృష్టించొచ్చని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం(Peddapuram)లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభ(Swarnandhra-Swachhandhra Sabha) నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను విధానంపై విమర్శలు కురిపించారు. జగన్ హయాంలో చెత్తకు పన్ను వేశారని, కానీ తీయలేదని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్యాన్ని గత ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోని చెత్తా చెదారాన్ని అక్టోబర్ 2 నాటికి తొలగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదని, చెత్తతో కూడా సంపద సృష్టించొచ్చని చెప్పారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






