జగన్ తప్ప ఇంకెవరూ లేరు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-03 08:12:54  IST  )

ప్రపంచంలో సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు జగన్ తప్ప ఎవరూ చేయడంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి చట్ట బద్ధత జరిగిన వేళ పార్లమెంట్‌లో వైసీపీ అనుసరించిన తీరు, మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనలతో కలకలం రేపిన విధానంపై ఆయన మండిపడ్డారు....

జగన్ తప్ప ఇంకెవరూ లేరు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో సింగపూర్‌(singapura)పై అవినీతి ఆరోపణలు జగన్(Jagan) తప్ప ఎవరూ చేయడంలేదని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. అమరావతి(Amaravati) చట్ట బద్ధత జరిగిన వేళ పార్లమెంట్‌లో వైసీపీ అనుసరించిన తీరు, మావిగన్(MAVIGUN) అంటూ కొత్త ప్రతిపాదనలతో కలకలం రేపిన విధానంపై ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని కట్టడమంటే నాలుగు ఆఫీసులు కాదన్నారు. నవ నగరాలు అభివృద్ధి చెందేలా అమరావతికి రూపకల్పన చేశామని చెప్పారు. పార్లమెంట్ నుంచి మట్టిని, పవిత్ర జలాలను ప్రధాని మోడీ తీసుకొచ్చి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్ మొత్తం అండగా నిలిచిందని తెలిపారు. అమరావతిని అడ్డుకునే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో అరాచకాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అమరావతి పేరును కూడా ఎత్తనివ్వకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ తీరుమార్చుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి కోసం..

అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తే వారిని పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానాల వల్లే అమరావతి కాపాడబడిందన్నారు. ప్రజాభిప్రాయం మేరకే పార్టీలు నడుచుకోవాలని, కానీ వైసీపీ మాత్రం భిన్నంగా వ్యవహరించిందని తెలిపారు. విశాఖ రాజధాని అని వైసీపీ చెబితే అక్కడే కూటమికి మెజార్టీ సీట్లు వచ్చాయన్నారు. మూడు రాజధానుల్లోనూ ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. అమరావతి బ్రాండ్ ను దెబ్బతీసేలా చాలా కార్యక్రమాలు చేశారని వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Andhra News : జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు : మాజీ మంత్రి విమర్శలు

Next Story