హైదరాబాద్‌పై చంద్రబాబు మార్క్.. మళ్లీ అదే ప్రస్తావన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-07 10:15:58  IST  )

1996లోనే హైదరాబాద్‌లో ఐటీ ప్రమోట్ చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘రైసినా డైలాగ్-2026’లో ఆయన పాల్గొన్నారు......

హైదరాబాద్‌పై చంద్రబాబు మార్క్.. మళ్లీ అదే ప్రస్తావన
X

దిశ, వెబ్ డెస్క్: 1996లోనే హైదరాబాద్‌(Hyderbad)‌లో ఐటీ ప్రమోట్ చేశామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన ‘రైసినా డైలాగ్-2026’(Raisina Dialogue-2026)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. హైదరాబాద్‌ను తమ హయాంలోనే నాలెడ్జ్ ఎకనామీకి కేరాఫ్‌గా మార్చామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం 50 శాతం జీసీసీలు భారత్ లోనే ఉన్నాయని, భవిష్యత్తులో 75 శాతానికి చేరుకుంటాయని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యాలీ ద్వారా కంప్యూటర్లను తయారు చేసి ఎగుమతి చేస్తామని తెలిపారు. బెస్ట్ లీడర్‌షిప్ ఫోరమ్‌గా అమరావతి రూపొందుతోందని పేర్కొన్నారు. అద్భుత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story