- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. రాజీపడం: మిగులు జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మిగులు జలాలు వాడుకోవం తప్పా అని సీఎం చంద్రబాబు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మిగులు జలాలు వాడుకోవం తప్పా అని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. అమరావతి(Amaravati), రాయలసీమ థర్మల్ లిఫ్ట్ ఇరిగేషన్(Rayalaseema Thermal Lift Irrigation) ప్రాజెక్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, రాజధానిపై జగన్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమన్నారు. రాయలసీమకు తీరని ద్రోహ చేసింది జగనేనని చెప్పారు. అప్పట్లో మూడు రాజధానులని, ఇప్పుడు మళ్లీ అమరావతిపై విషం ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన నగరాలు రివర్ ఫ్రంట్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. జగన్‌కు నాగరికత తెలియదని విమర్శించారు. సింధూ నాగరికత తెలుసుకుంటే మంచిదని చెప్పారు. ఢిల్లీ సహా ప్రధాన నగరాలన్ని నదీతారాల వద్దే ఉన్నాయని చెప్పారు. లండన్ కూడా నదీతీరంలోనే ఉందని గుర్తు చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మడం మానలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లు కూడా నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకోవడం వల్లే రాయలసీమలలో హార్టికల్చర్ డెవలప్ అయిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
గొడవలు పడితే నష్టపోతాం
‘‘నీటి విషయంలో గొడవలు పడితే రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. ఏపీ, తెలంగాణ బాగుకోసం ప్రయత్నం చేయడం తప్పు ఎలా అవుతుంది. మిగులు జలాలు వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సస్యశామలం అవుతాయి. రాయలసీమకు నీరిచ్చామనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం పట్టిసీమ. సీమ పట్ల మాకున్న చిత్తశుద్ధి చూపించాం. పట్టిసీమతోనే సీమలో ఉద్యాన పంటలు పెరిగాయి. 2020లో రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో కేవలం మట్టి పనులు మాత్రమే జరిగాయి. రూ.900 కోట్ల బిల్లులు చూపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాం. రాజీపడే ప్రసక్తే లేదు.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






