లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనే తమ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్(Health Andhra Pradesh) కావాలనే తమ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. జనాభా పెరుగుదలపై అసెంబ్లీ(Assembly)లో ఆయన మాట్లాడారు. వచ్చే సంవత్సరం నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని తెలిపారు. 2047 నాటికి భారత్‌లో 162 కోట్ల జనాభా అవుతారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోందన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా క్రమంగా తగ్గిపోతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వల్లే జనభా బ్యాలెన్స్ అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story