అదే నా జీవిత ఆశయం.. దేవగుడిపల్లె సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు...

అదే నా జీవిత ఆశయం.. దేవగుడిపల్లె సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లె ప్రజావేదిక సభలో ఆయన వ్యాఖ్యానించారు. గంగా-కావేరి అనుసంధానం జరిగితే దేశంలో కరువు అనే మాట వినపడదన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తాను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని చెప్పారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వెనిగల్లు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందని చెప్పారు.

‘‘మరో రూ.22 కోట్లు ఇస్తే మరిన్ని చెరువులకు నీరు అందే అవకాశం ఉండటంతో వెంటనే మంజూరు చేస్తున్నాం. వచ్చే ఏడాదికి శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేస్తాం. ఇక్కడ నుంచి చిత్తూరుకు హంద్రీనీవా నీరు మళ్లిస్తాం. అలాగే మొదటి ఫేజ్‌లో నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు నీళ్లు తెస్తాం. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. 2029 నాటికి స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story