- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు సంబంధం లేదు: సీఎం చంద్రబాబు
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: ఇందాపూర్ డెయిరీ(Indapur Dairy)కి హెరిటేజ్(Heritage)కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. తిరుమల లడ్డూ తయారీ(Tirumala Laddu Preparation)కి ఇందాపూర్ డెయిరీనే నెయ్యి సరఫరా చేసిందని, ఈ సంస్థకు హెరిటేజ్‌కు సంబంధం ఉందని వైసీపీ నేతలు(Ycp Leaders) ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీ చాలా సంస్థలకు కో-మ్యానుఫాక్చరింగ్ చేస్తారని తెలిపారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తప్పులు జరిగినా..
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పించుకునేందుకు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి నాటకాలు ఆపాలన్నారు. వాళ్లు తప్పు చేసి మళ్లీ తమల్నే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారని తెలిపారు. తాను బతికి ఉన్నంతకాలం వెంకటేశ్వరస్వామికి అపచారం జరగనివ్వనని చెప్పారు. హెరిటేజ్ పై కావాలనే వైసీపీ నాయకులు బురద చల్లారని ఆరోపించారు. తాను రాజకీయాల్లో కొన్ని నియమాలు పెట్టుకున్నానన్నారు. ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు






