- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... అందరికీ రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా
ఏపీలో అందరికీ రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో అందరికీ రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా(Health insurance) అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు(Cm Chandhrababu) తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని(Pedakakani)లో శంకర ఐ ఆస్పత్రి భవనాన్ని ఆయన ప్రారంభించారు. శంకర కంటి ఆస్పత్రి(Shankara Eye Hospital) 50 ఏళ్ల వేడుకకు హాజరవుతానని సీఎం చంద్రబాబు తెలిపారు. రోజూ 750 మందికిపైగా నేత్ర వైద్యం అందించడం అరుదైన విషయమని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ శంకర ఆస్పత్రి సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. చిన్నారుల కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గొప్ప విషయమని చెప్పారు. పేదరికం లేని సమాజం నిర్మించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంజీవని పథకం ద్వారా ఇప్పటికే వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఆస్తులు ఉన్నా.. ఎవరికైనా ఆరోగ్యమే ముఖ్యమన్నారు. శంకర ఆస్పత్రికి అన్నివిధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






