మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 12:35:56  IST  )

మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు....

మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది: సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. నంద్యాల జిల్లా(Nandyala) మల్యాల పంపింగ్ స్టేషన్‌లో మోటార్లు ఆన్ చేసి హంద్రీనీవా(Handreeniva) ద్వారా రాయలసీమ(Rayalaseema)కు కృష్ణా నీటిని విడుదల చేసిన అనంతరం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేశామని చెప్పారు. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేశామన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడంతో రాయలసీమ రైతాంగానికి చాలా మేలు జరుగుతుందన్నారు. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం పేర్కొన్నారు.

‘‘ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నేరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

చంద్రబాబు ట్వీట్

Next Story