పేదలకు ఉచితంగా ఇళ్లు... అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

2029లోగా అందరికీ సొంతిళ్లు ఉండేలా చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు....

పేదలకు ఉచితంగా ఇళ్లు... అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: 2029లోగా అందరికీ సొంతిళ్లు ఉండేలా చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. శనివారం జరిగిన అసెంబ్లీ(Assembly)లో ఆయన ప్రసంగించారు. ఈ దీపావళి(Deepavali)లోపు 3 లక్షల ఇల్లు పూర్తి ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాలని తాను చెప్పినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తమిళనాడు(Tamilanadu)లో ప్రభుత్వం మారినప్పటికీ అమ్మ క్యాంటీన్లు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. కానీ జగన్ హయాంలో అన్న క్యాంటీన్లు లేకుండా చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు భోజనం, టిఫెన్ పెడుతున్నామని చెప్పారు. ఈ క్యాంటీన్లను త్వరలో 271కు పెంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story